వరంగల్ అధికారులపై CM రేవంత్ ఆగ్రహం

85చూసినవారు
వరంగల్ అధికారులపై CM రేవంత్ ఆగ్రహం
వరంగల్ అధికారుల తీరుపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి అంచనా వ్యయం పెంచడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. అప్రూవల్ లేకుండా రూ.1,100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1,726 కోట్లకు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ. 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారన్నారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ అడిట్ నిర్వహించాలని.. యుద్ధ ప్రాతిపదికన వరంగల్ ఆసుపత్రిని పూర్తి చేయాలని ఆదేశించారు.