స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి ఒప్పందం

77చూసినవారు
స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి ఒప్పందం
దావోస్‌ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్, స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో మరో ఒప్పందం చేసుకున్నారు. రాకెట్‌ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు స్కైరూట్‌ తో MoU కుదుర్చుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ యాజమాన్యంతో మంగళవారం సీఎం భేటీ అయ్యారు. రూ. 500 కోట్లతో రాకెట్‌ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సంస్థ సిద్దమైనట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ విజయం గర్వకారణమని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకురావడం అభినందనీయమని కొనియాడారు.