రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

63చూసినవారు
రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
పంట రుణమాఫీపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీ విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. పూర్తి స్థాయి బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పూర్తిస్థాయి వివరాలతో పాటు వ్యయాన్ని రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు.

ట్యాగ్స్ :