ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు?

59చూసినవారు
ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు?
భారత దేశానికి నాలుగో ప్రధానమంత్రిగా మొరార్జీ రాంచోడ్‌జీ దేశాయ్ పనిచేశారు. అంతకు ముందు ఆయన ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నప్పడు ఆయన రికార్డులే వేరు. ఎవరూ అధిగమించలేని రీతిలో అత్యధికంగా పది సార్లు బడ్జెట్‌ను మొరార్జీ సమర్పించారు. 1959 నుంచి 1964 వరకు, తిరిగి 1967 నుంచి 1969 వరకు మొరార్జీ మొత్తం 8 వార్షిక బడ్జెట్లు, 2 తాత్కాలిక బడ్జెట్లు ప్రవేశపెట్టారు. పుట్టినరోజు నాడే బడ్జెట్ సమర్పించిన ఏకైక ఆర్థిక మంత్రి మొరార్జీ.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్