రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తయింది. వైసిపి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానీకం కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సామాజిక పెన్షన్లను పెంచి ప్రజల్లోకి సానుకూల సంకేతాలను పంపింది. అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. మెగా డిఎస్‌సి ఫైలుపై సంతకం చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు, ధాన్యం బకాయిల చెల్లింపులు చేసింది. అయితే, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సి ఉంది.