కుప్పకూలిన బాల్కనీ.. ఇద్దరు మృతి (వీడియో)

82చూసినవారు
మెక్సికోలోని శాన్ లూయిస్ పోటోసి ప్రాంతంలో తాజాగా విషాద ఘటన జరిగింది. ఓ నైట్‌క్లబ్‌లో గాజు బాల్కనీ పగిలి కుప్పకూలింది. దీంతో బాల్కనీ నుంచి కింద పడి ఇద్దరు చనిపోయారు. మరో 15 మంది గాయపడ్డారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి పడడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you