సందిగ్ధంలో ఉన్నాను: రాహుల్ గాంధీ

74చూసినవారు
సందిగ్ధంలో ఉన్నాను: రాహుల్ గాంధీ
వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ తాను ఏ స్థానానికి రాజీనామా చేయాలో సందిగ్ధంలో ఉన్నట్లు వెల్లడించారు. వయనాడ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను రెండోసారి ఎంపీగా గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటానన్నారు. వయనాడ్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచాక తొలిసారి ఆయన స్థానికంగా పర్యటించారు.

ట్యాగ్స్ :