కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై, కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం రాత్రికి రాత్రే అపోలో ఆసుపత్రి నుంచి అమ్మవారి గుడి వరకు బీటీ రోడ్డు నిర్మించారు. అయితే, దీర్ఘకాలంగా తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం ఆలస్యమవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా, ఓవర్ బ్రిడ్జి సమీపంలో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలతో నిండిపోవడం వల్ల వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.