పండగ వేళ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ (ట్రైన్ నెంబర్ 20707/20708) ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు SCR అధికారులు వెల్లడించారు. ఈ ట్రైన్‌లో బెర్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కోచ్‌ల సంఖ్య పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.