ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రవేశాల విభాగం సంచాలకుడు ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ప్రకటన ప్రకారం, ఈనెల 24 నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. అపరాధ రుసుముతో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ https://www.osmania.ac.in ను సందర్శించండి.