యుపిలోని ముజఫర్‌నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై బిలాస్‌పూర్ కట్ సమీపంలో కంకర లోడ్ తో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. దీంతో ట్రక్కు క్యాబిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో దంపతులిద్దరూ కాలి బూడిదయ్యారు. కాగా మృతులు సుధీర్ మరియు సోనియాగా గుర్తించారు. వీరు మొరాదాబాద్‌లోని వేర్వేరు పిఎస్ లలో కనిస్టేబుల్స్ గా పనించేస్తున్నారు.