ప్రస్తుత సోషల్ మీడియాలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ స్వీటు షాపులోకి వెళ్లి కేజీ స్వీట్ ఆర్డర్ చేసింది. షాపులోని వ్యక్తి వాటిని బయటికి తీసి తూకం వేస్తుంటాడు. అయితే అతను స్వీట్లు తీయడానికి కిందకు వంగగానే మహిళ తక్కెడలోని స్వీటును తీసుకుని నోట్లో వేసుకుంటుంది. ఇలా దాదాపు మూడు స్వీట్స్ తినేస్తుంది. ఈ విచిత్ర దొంగతనం చూసిన వారందరూ తెగ నవ్వుకుంటున్నారు.