హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జంట ఆన్లైన్ సాక్షిగా ఒక్కటయ్యారు. సిమ్లాకు చెందిన ముహమ్మద్ ఉద్యోగరీత్యా టర్కీలో పని చేస్తున్నాడు. ఇటీవల అతనికి పెళ్లి కుదరడంతో ఇండియా వెళ్లడానికి లీవ్ కోసం అప్లై చేసుకోగా కంపెనీ లీవ్ ఇవ్వలేదు. దీంతో వీడియో కాల్లోనే నిఖా చేసుకున్నాడు.పెళ్లి కూతరు తాత మంచాన పడడంతో తమ పెళ్లిని తాత చూడాలని పెళ్లి కూతురు కోరడంతో వీడియో కాల్లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. ఈనెల 4న మండీలో వీరి వివాహం జరిగింది.