మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

78చూసినవారు
మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్
IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పోలీసులు మాతృశ్రీ నగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ పై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.43.57 లక్షల నగదు, ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్