భూ రికార్డుల్లో తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు!

64చూసినవారు
భూ రికార్డుల్లో తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు!
TG: ప్రభుత్వం ధరణి స్థానంలో 'భూ భారతి' చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన ఈ చట్టం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం కఠిన నిబంధనలను పెట్టినట్లు తెలుస్తోంది. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులతో పాటు ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్