ఇండోనేషియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లితండ్రులు చూస్తుండగానే ఓ బాలికను మొసలి సరస్సులోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. గత ఆదివారం (జనవరి 12) ఈ ఘటన జరిగింది. కాకా అనే 5 ఏళ్ల చిన్నారిని మొసలి గ్రామ సరస్సులోకి లాక్కెళ్లి చంపి తిన్నది. అనంతరం నీటిలో తేలియాడుతున్న బాలిక మృతదేహాన్ని రెస్క్యూ టీం స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో మొసలి నోటిలో చిన్నారి పుర్రె నలిగిపోయిందని అధికారులు తెలిపారు.