హీరో నాని నటించిన ‘జెర్సీ’ మూవీతో శ్రద్దా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆశించినంత ఫలితం దక్కలేదు. అయితే తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ – 2లో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారట. కాగా తాజాగా విడుదలైన బాలయ్య మూవీ ‘డాకు మహారాజ్’తో ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.