రోడ్డు ప్రమాదం.. మహిళా మంత్రికి గాయాలు

63చూసినవారు
రోడ్డు ప్రమాదం.. మహిళా మంత్రికి గాయాలు
కర్ణాటక మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ఉదయం బెళగావిలో ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్‌ హత్తిహోళికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కుక్కను తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్