బూడిద గుమ్మడి సాగు రైతులకు లాభాలను ఇస్తోంది. 70 నుంచి 120 రోజుల వరకు దశల వారీగా పంట చేతికొస్తుంది. ఎకరాకు 40 టన్నుల దిగుబడి వస్తోంది. టన్ను ధర ఏటా రూ.5- 7 వేల వరకు పలుకుతోంది. కరోనా సమయంలో ఊహకందని రీతిలో ధర రూ.20 వేలకు ఎగబాకింది. ప్రస్తుత ధర ఆశాజనకంగా ఉంది. బూడిద గుమ్మడిని తెలుగు రాష్ట్రాల్లో ఇళ్ల ముందు దిష్టికి, వడియాలకు వినియోగిస్తారని, అధిక బరువున్న కాయలను ఔషధాల తయారీకి వినియోగిస్తారు.