పాలకూర విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. భూమిలో తేమను బట్టి ప్రతి 7-10 రోజులకు ఒక్కసారి నీటి తడి ఇవ్వాలి. తుంపర పద్ధతిలో నీటిని అందిస్తే నీటిని పొదుపు చేయడంతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయవచ్చు. పేనుబంక, ఆకులు తినే గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మి.లీ.ల మలాథిన్ కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి పిచికారీ చేయాలి.