అనాస కొండ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు పండిస్తున్నారు. అనాస ఉష్ణమండల వంట. అనాస సాగుకి అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ, ఇసుకతో కూడిన గరపనేలలు చాలా అనుకూలం. నల్లరేగడి నేలలు, నీరు నిలబడే నేలలు అనుకూలమైనవి కావు. నేలలో మట్టి సుమారు 40 నుండి 60 సెం.మీ. వరకు ఉంది రాయి కాని, కంకర కానీ లేకుండా ఉంటే మొక్క పెరుగుదల బాగా ఉంటుంది. అనాసలో చాలా రకాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా సింహాచలం, క్యూ, క్వీస్ రకాలను సాగు చేస్తున్నారు.