సత్వర న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. పెండింగు కేసులు భారీ స్థాయిలో పెరిగిపోవడం అతిపెద్ద సవాల్ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆమె.. న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత దేశంలోని న్యాయమూర్తులందరిపై ఉందన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళా అధికారుల సంఖ్య పెరగడంపై ముర్ము సంతోషం వ్యక్తం చేశారు.