ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ నెలలో అమెరికా వెళ్లనున్నారు. మోకాలి చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు ఆయన కార్యాలయం తెలిసింది. కరోనా సంక్షోభం తరువాత దలైలామా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎటువంటి మీడియా సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనరు. తిరిగి ధర్మశాలకు తిరిగొచ్చాక యాథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.