రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌లో ఏర్పాటు చేసిన స్తంభానికి ఓ యువకుడి మృతదేహం వేళాడుతూ కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది. కాన్పూర్-లక్నో హైవేపై ఓ యువకుడి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి స్తంభానికి వేళాడదీశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.