గ్రహంబెల్‌ను చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నప్పటికీ ఆయన వివిధ రంగాలలో ఆసక్తిని కనబరచాడు. 1880వ సంవత్సరంలో ఈయన టెలిఫోన్ ఆవిష్కరణకుగాను ఫ్రెంచి ప్రభుత్వం నుండి 'వోల్టా' పురస్కారాన్ని అందుకున్నాడు. కాగా అప్పట్లో దీని విలువ 50,000 ఫ్రాంకులు అంటే సుమారు పదివేల డాలర్లన్నమాట. తన జీవితకాలమంతా రకరకాల పరిశోధనలతో గడిపిన గ్రహంబెల్.. 75 ఏళ్ల వయసులో చక్కెర వ్యాధి కారణంగా 1922 ఆగస్టు 2న మరణించారు.