చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ రీయూజబుల్ రాకెట్ కోసం చేసిన ప్రయోగం విఫలమైంది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన నెబులా-1 రాకెట్‌కు వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11 లక్ష్యాలతో వీటిని నిర్వహించగా.. వాటిలో 10 విజయవంతమయ్యాయి. కానీ, ఒకటి మాత్రం ల్యాండింగ్‌లో విఫలమైంది. నేలపై దిగడానికి కొన్ని క్షణాల ముందు అదుపుతప్పి పేలుడు సంభవించింది.