AP: ఇకపై ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను ఇసుకను రూ.475 చొప్పున విక్రయించగా.. ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు, రవాణా ఖర్చు రూ.100 తీసేస్తే.. మిగిలిన రూ.375 ప్రభుత్వానికి వచ్చేది. తాజా నిర్ణయం ప్రకారం.. రూ.375 కాకుండా.. కేవలం రూ.88 మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థలకు జమ చేయనున్నారు.. ఇందులో సీనరేజ్ ఛార్జ్ కింద రూ.66 (టన్నుకు) తీసుకుంటున్నారు.