జపాన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మూడు రోజుల పర్యటన ప్రారంభం అయింది. ఈ మేరకు హానిడ విమానాశ్రయంలో ఆయనకు భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో బాగంగా గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు వ్యాపార కంపెనీల ప్రతినిధులతో భట్టి భేటీ కానున్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు వారిని ఆయన ఆహ్వానించనున్నారు.