హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇండ్ల నిర్మాణాలకు హైడ్రా అనుమతులు ఇవ్వదని చెప్పారు. బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. GHMC, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని చెప్పారు. ప్రజాభవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.