కేంద్రం నిధులు నాడు-నేడు పనులకు మళ్లింపు

67చూసినవారు
కేంద్రం నిధులు నాడు-నేడు పనులకు మళ్లింపు
ప్రతిపాదనల మేరకు నెల్లూరు జీజీహెచ్, విశాఖ విమ్స్‌లో నిర్మాణాలు ఇంతవరకు ప్రారంభించలేదు. మరోవైపు రూ.8 వేల కోట్లతో కొత్త వైద్య కళాశాలలను నిర్మించాలని నిర్ణయించి ఇందులో రూ.1,429 కోట్లనే అప్పటి ప్రభుత్వం వెచ్చించింది. కొత్త కళాశాలల పనుల కోసం రూ.1,616 కోట్ల మంజూరుకే రుణ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. పీజీ వైద్య సీట్ల పెంపునకు తగ్గట్టు రూ.755 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 నిష్పత్తిలో భరించాలి. ఈ మేరకు కేంద్రం ఇచ్చిన నిధులను సంబంధిత పనులకు వెచ్చించకుండా నాడు-నేడు పనులకు మళ్లించారు.