లడ్డూ వివాదం.. సిట్ చీఫ్ నియామకంపై ఫోకస్

82చూసినవారు
లడ్డూ వివాదం.. సిట్ చీఫ్ నియామకంపై ఫోకస్
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు వినియోగం, అధికార దుర్వినియోగంపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే సిట్ చీఫ్‌గా ఎవర్ని నియమించాలనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో సీనియర్ ఐపీఎస్‌‌లు పీహెచ్‌డీ రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠిలు ఉన్నారు. వీరిద్దరిలో ఒకర్ని సిట్ చీఫ్‌గా నియమించే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు వినీత్ బ్రిజ్‌లాల్, సీహెచ్ శ్రీకాంత్ పేర్లూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్