అమెరికా పర్యటనలో పాలస్తీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ

56చూసినవారు
అమెరికా పర్యటనలో పాలస్తీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ
క్వాడ్ సమ్మిట్ లో భాగంగా న్యూయార్క్‌లో పలు దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మోదీ సమావేశమయ్యారు. గాజాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మోదీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను కాపాడటానికి భారత్ యొక్క మద్దతును మోదీ పునరుద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్