రేపు అకౌంట్లోకి డబ్బులు జమ

50చూసినవారు
రేపు అకౌంట్లోకి డబ్బులు జమ
వరదలతో నష్టపోయిన బాధితుల అకౌంట్లోకి ఏపీ ప్రభుత్వం బుధవారం ఆర్థిక సాయం జమ చేయనుంది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ఈ సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. దుకాణాలు ధ్వంసమైన వారికి రూ.25 వేలు, పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

సంబంధిత పోస్ట్