లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సుఖ సంతోషాలతో ఉండాలని అంతా కోరుకుంటారు. అయితే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్నింటిని పాటించాలని పండితులు పేర్కొంటున్నారు.
• వాస్తు శాస్త్రం ప్రకారం అల్మరాను ఇంటి దక్షిణ గోడకు ఆనుకునే విధంగా ఉంచాలి. దాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకుండా డబ్బులు, నగలు వంటివి అందులో ఉంచాలి.
• వాటితో పాటు తమలపాకులు, లక్ష్మీ యంత్రాన్ని ఉంచాలి. ఎరుపు రంగు గుడ్డలో పసుపు ముద్ద కట్టి అల్మరాలో ఉంచితే లక్ష్మి నిలుస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఖజానాను పూజించాలని సూచిస్తున్నారు.