రోడ్ల మరమ్మతులకు ఎంత అవసరమో తెలుసా?

56చూసినవారు
రోడ్ల మరమ్మతులకు ఎంత అవసరమో తెలుసా?
రాష్ట్ర, జిల్లా రహదారుల్లో మరమ్మతులకు సంబంధించి గత ఏడాదికి చెందిన స్పిల్‌ఓవర్‌ రూ.600 కోట్లు ఉన్నాయి. అంటే ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌లో మరమ్మతులకు కనీసం రూ.600 కోట్లు బడ్జెట్‌ కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజినీర్లు రూ.900 కోట్ల వరకు (ఒకటిన్నర రెట్లు) పనులు మంజూరు చేసేందుకు వీలుంటుంది. వాటితో స్పిల్‌ ఓవర్‌ రూ.600 కోట్ల పనులతోపాటు, కొత్తగా అంచనా వేసిన రూ.283 కోట్ల పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.