ఏపీలో ఓ పోలీసు అధికారి చేసిన పనికి అందరూ షాక్‌కు గురయ్యారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. రెండు వర్గాల మధ్య దాడులు జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించగా.. విధి నిర్వహణను విస్మరించిన ఆయన మందుబాబులతో కలిసి చిందులేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్సైను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.