తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా పేరుంది. ఈ లడ్డూకు 309 ఏళ్ల చరిత్ర ఉంది. మొదట 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. 1803లో ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది. లడ్డూ తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. అది కాస్తా 1940లో లడ్డూగా రూపొందింది. నామమాత్రంగా ప్రసాదాలు తయారు చేస్తుండగా టీటీడీ పాలకమండలి 1950లో లడ్డూల తయారీని పెంచింది. ఈ లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ ఉండడం విశేషం.