'బ్రహ్మ ముహూర్తం' అంటే మీకు తెలుసా?

3822చూసినవారు
'బ్రహ్మ ముహూర్తం' అంటే మీకు తెలుసా?
ఒక పనిని మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడం కోసం నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని మంచి ముహుర్తం అంటారు. అందుకే తెల్లవారుజామున ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని చెబుతారు. అయితే తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి 2 ఘడియల ముందు కాలాన్ని అంటే 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని అంటారు. ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్త సమయంలో దేవుడిని ధ్యానించి పనులు మొదలు పెట్టాలని చెబుతారు. అందుకే చాలా మంది నూతన గృహప్రవేశం కోసం ఈ సమయాన్ని ఎంచుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి ఆ భగవంతుడి శక్తి తోడవుతుందని అంటారు.

సంబంధిత పోస్ట్