'కురుడుమలై' గణపతి ఆలయ విశిష్టత తెలుసా!

56చూసినవారు
'కురుడుమలై' గణపతి ఆలయ విశిష్టత తెలుసా!
కురుడుమలై గణపతి ఆలయం కర్ణాటకలోని కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో ఉంది. ఈ ఆలయంలో ఏక సాలగ్రామ శిలపై చెక్కిన 14 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని త్రిమూర్తులు ప్రతిష్టంచారని స్థలపురాణం చెబుతుంది. లంబోదరుని ఆదేశం మేరకు శ్రీకృష్ణదేవరాయలవారు ఇక్కడ ఆలయానికి ప్రాకారం నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో అర్థరాత్రి సమయంలో గుడి లోపలి నుంచి స్తోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని భక్తుల విశ్వాసం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you