ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

52చూసినవారు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ
విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో జన్మభూమిని యథావిధిగా నడపనున్నట్లు ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్