సాధారణంగా అన్ని చోట్ల విజయ దశమి రోజున రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. కానీ ఆ ఆలయంలో మాత్రం దసరా రోజున తెల్లవారుజాము నుంచే రావణుడు పూజలను అందుకుంటాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దశకంఠుడికి ఆలయం ఏడాదికి ఒకసారి మాత్రమే దసరా రోజున తెరుచుకుంటుంది. సాయంత్రం కల్లా మూసివేస్తారు. రావణుడు గొప్ప పండితుడు, అన్ని దైవిక శక్తులను కలిగి ఉన్నాడని స్థానికులు నమ్ముతారు. ఈ గుణాల వల్లే ఆయన పూజింపబడతాడని చెబుతారు. ఇక్కడ రావణుడిని జ్ఞానం, శక్తికి చిహ్నంగా పూజిస్తారు.