మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం. అయితే రోజుకు 2 సార్లు మాత్రమే బ్రష్ చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి బ్రష్ చేసుకోవాలని తెలిపారు. తద్వారా చిగుళ్లు ప్రేరేపితమై, వాటికి సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చన్నారు. అలాగే దంతాల్ని ఎక్కువ సేపు తోమితే పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోతుందని అన్నారు. కాబట్టి రెండు, మూడు నిమిషాలలోపే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవాలని సూచించారు.