ఈ రోజుల్లో నాన్ వెజ్ ఇష్టపడని వారుంటారు అంటే చాలా అరుదు. అందులోనూ చికెన్ లెగ్ పీస్ అంటే లొట్టలేసుకుని తింటారు. అయితే, ఓ వ్యక్తి శాఖహారులకు లెగ్ పీస్‌లు తినే అనుభూతిని కలిగిస్తున్నాడు. ఈ వీడియోలో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్‌లా కనిపిస్తున్న ముక్కలను చూసి అందరూ మాంసాహారమే అనుకుంటారు. కానీ కట్ చేసి చూస్తే.. అందులో కేక్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.