కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో స్థానిక సీల్దా కోర్టు నేడు తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మృతురాలి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు కోర్టులో జరుగుతున్న విచారణకు సీబీఐ తమని పిలవలేదని పేర్కొన్నారు. తమ లాయర్ కూడా కోర్టుకు వెళ్లొద్దని చెప్పారని తెలిపారు. అలాగే ఈ కేసులో దోషులకు కఠిన శిక్ష పడేలా సీబీఐ చొరవ తీసుకోవడం లేదని ఆరోపించారు.