ప్రతిరోజూ 4 కప్పుల కంటే ఎక్కువ సార్లు కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కాఫీని ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. ఇంకా గుండెలో మంట, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రక్తపోటు పెరుగుతుంది. చెబుతున్నారు. కాబట్టి కాఫీని ఎక్కువగా తాగేవారు.. ఆ అలవాటు మానుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచించారు.