తాగిన మత్తులో 20 ఏళ్ల యువతుల ఫ్లాట్‌లోకి దూసుకెళ్లి దాడి (వీడియో)

57చూసినవారు
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. భోపాల్‌లోని రెసిడెన్షియల్ సొసైటీ, న్యూ మినల్ రెసిడెన్సీలో రాత్రి వేళ మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు యువతుల అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి 20 ఏళ్ల యువతిపై దాడి చేశారు. ఆమె అరుపులు విని ఆమె సోదరుడు తన గది నుంచి బయటకు వచ్చి నిందితులతో గొడవకు దిగాడు. ఈ ఘటన మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే, వారి మధ్య వివాదాల కారణంగానే యువకులు దాడి చేసినట్టు తెలిసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్