AP: నిరుద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్న్యూస్ చెప్పారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 16 వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 11 డీఎస్సీల ద్వారా 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ముందుగా టెట్ నిర్వహించామన్నారు.