ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారికి గుడ్‌న్యూస్. ఆ రెండింటికీ పనిచేసే ‘మౌంజారో’ అనే ఔషధాన్ని ఎలీ లిల్లీ ఇండియా సంస్థ భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతితో సింగిల్ డోస్ వయల్ రూపంలో ఈ ఇంజెక్షన్‌ను విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. దీన్ని వైద్యులు సిఫారసు చేసిన మోతాదు ప్రకారం వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది.