బెట్టింగ్ యాప్స్ కేసు.. ‘చిరు’ ప్రస్తావన తెచ్చిన సీపీఐ నారాయణ

85చూసినవారు
బెట్టింగ్ యాప్స్ కేసు.. ‘చిరు’ ప్రస్తావన తెచ్చిన సీపీఐ నారాయణ
TG: చేతి నిండా అవకాశాలు ఉన్నవాళ్లు కూడా తప్పుడు పనులతో డబ్బు సంపాదించుకోవడం ఎందుకు? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. గతంలో చిరుకు రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. ‘‘ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు?’ అని చిరంజీవిని ప్రశ్నించా. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారు. ఆ తర్వాత చెయ్యలేదు కూడా" అని నారాయణ అన్నారు.

సంబంధిత పోస్ట్