ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటలకు
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.1గా నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.